ETV Bharat / city

లోకేశ్ జూమ్‌ మీటింగ్‌లో కొడాలి నాని, వంశీ - YCP leaders in Lokesh zoom call

Ycp leaders in Nara Lokesh Zoom Call : ఏపీలో పదోతరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతశాతం తగ్గడంపై విద్యార్థులతోనూ, ఫెయిలై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జూమ్ మీటింగ్‌ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యేలు రావడంపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ycp leaders in Nara Lokesh Zoom Call
Ycp leaders in Nara Lokesh Zoom Call
author img

By

Published : Jun 9, 2022, 2:08 PM IST

లోకేశ్ జూమ్‌ మీటింగ్‌లో వైకాపా ఎమ్మెల్యేలు నాని, వంశీ

YCP leaders in Nara Lokesh Zoom Call : ఏపీలో పదో తరగతి విద్యార్థులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్వహించిన జూమ్‌ సమావేశంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వైకాపాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూమ్‌ మీటింగ్‌లో ప్రత్యక్షమయ్యారు. గమనించిన లోకేశ్‌.. సమావేశంలో ఆ పార్టీ నేతలు ఉన్నా ఫర్వాలేదని, వైకాపా ప్రభుత్వం ఎలా ఏడ్చిందో వారికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

విద్యార్థులను ఫెయిల్‌ చేయడం ప్రభుత్వం చేతగానితనమని.. జూమ్‌లో దొంగ ఐడీలతో సమావేశాన్ని డిస్టర్బ్‌ చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆ సమావేశం నుంచి ఎమ్మెల్యే వంశీ తప్పుకున్నారు. కార్తిక్‌ కృష్ణ అనే విద్యార్థి పేరుతో కొడాలి నాని పాల్గొన్నారు. ప్రభుత్వం చేతగానితనాన్ని ఎండగడతానంటూ లోకేశ్‌ ఆ సమావేశాన్ని కొనసాగించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.