ETV Bharat / city

Letter to Vijayasaireddy: 'ఆ బాధ్యతలు వల్లభనేని వంశీకి వద్దు' - ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం

Letter to Vijayasaireddy: ఏపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించొద్దంటూ.. జగనన్న అభిమానులు, వైకాపా కార్యకర్తల పేరిట.. ఎంపీ విజయసాయిరెడ్డికి కొందరు లేఖ రాశారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నియోజకవర్గ బాధ్యతలు వంశీకి తప్ప ఎవరికి కేటాయించినా.. 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని లేఖలో పేర్కొన్నారు.

Letter to Vijayasaireddy
Letter to Vijayasaireddy
author img

By

Published : Mar 20, 2022, 10:22 PM IST

Letter to Vijayasaireddy: ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అప్పగించొద్దంటూ.. జగనన్న అభిమానులు, వైకాపా కార్యకర్తల పేరిట.. ఎంపీ విజయసాయిరెడ్డికి కొందరు రాసిన లేఖ వైరల్‌గా మారింది. తొమ్మిదేళ్ల పాటు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని కాపాడామని వారు లేఖలో పేర్కొన్నారు.

కేసుల నుంచి తప్పించుకోవడానికే.. తెదేపా నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ.. వైకాపాకు మద్దతు ప్రకటించారని ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన వైకాపా కార్యకర్తలు.. ఇప్పటికీ అక్రమ కేసుల వ్యవహారంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా కుదేలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి నియోజకవర్గ బాధ్యతలను.. వల్లభనేని వంశీకి తప్ప ఎవరికి కేటాయించినా.. 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గంలో పార్టీని కాపాడేందుకు సత్వరమే నూతన ఇన్‌ఛార్జ్‌ని నియమించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Letter to Vijayasaireddy
'గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు వల్లభనేని వంశీకి ఇవ్వొద్దంటూ లేఖ'

ఇదీ చూడండి: Revanth Reddy: 'రైతుల పంటలు కొనకుంటే కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.