తెదేపా అధికార ప్రతినిధి(Pattabhi name changed on flexi) పట్టాభిరామ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో.. బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైకాపా నాయకులు నిరసన చేపట్టారు. అయితే.. ఈ సందర్భంగా వారు చేసిన పని విమర్శలకు దారితీసింది.
సీఎం జగన్పై పట్టాభిరామ్(Pattabhi name changed on flexi) చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ.. వైకాపా నాయకులు ఓ ఫ్లెక్సీని ముద్రించారు. అయితే.. దానిపై తెదేపా నేత ‘పట్టాభిరామ్’(Pattabhi name changed on flexi) పేరుకు బదులు.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపక ఛైర్మన్ ‘భోగరాజు పట్టాభి సీతారామయ్య’ పేరు ముద్రించారు.
కనీసం.. ఎవరి పేరు ముద్రిస్తున్నాం? అనేది చూసుకోకుండా.. ఇలా ప్రముఖుని పేరు ఉపయోగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్య అవమానకరమంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Reddy Subramanyam: "రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తోంది"