హిమాచల్‌ప్రదేశ్‌లోని పిని ఆ గ్రామంలోని మహిళలు ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. మహిళలు ఏడాదిలో ఐదురోజులపాటు బట్టలు వేసుకోరు. పైగా ఆ రోజుల్లో తమ భర్తలతో మాట్లాడరు. వివస్త్రలుగానే ఇంట్లో పనులు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మగవారు కూడా మద్యం, మాంసాహారం జోలికి వెళ్లరు.
ఆగస్టు నెలలో వచ్చే ఓ పండగ సందర్భంగా పిని గ్రామ ప్రజలు ఆ విధంగా ఆచారాన్ని నిష్ఠగా పాటిస్తుంటారు. అలా చేయకపోతే అరిష్టమనీ కీడు జరుగుతుందనీ నమ్ముతారు. ఆ కీడు వారితోపాటు గ్రామానికీ చుట్టుకుంటుందని భావిస్తారు.
ఇలా చేయడానికి అక్కడ ఓ కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే... పూర్వం ఆ ప్రాంతంలో రాక్షసులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ చిత్రహింసలు పెడుతుండేవారట. ఆ సమయంలో లాహుఘోండ్ అనే దేవత వచ్చి రాక్షసులను మట్టుపెట్టి ప్రజల్ని కాపాడిందని చెబుతారు. ఆ దేవత విజయానికి గుర్తుగానే అక్కడ ఐదురోజుల పండగను ఈ విధంగా జరుపుకొంటున్నారట పిని గ్రామస్థులు.