ETV Bharat / city

మూర్తీభవించిన మానవత్వం.. అనాథ శవాన్ని మోసిన మహిళా ఎస్సై - కాశిబుగ్గ మహిళా ఎస్సై శిరీషా వార్తలు

అనాథ శవాన్ని భుజాలపై మోసుకెళ్లి.. మానవత్వాన్ని చాటింది ఓ మహిళా ఎస్ఐ. ఏ ఆపద వచ్చినా పోలీసులు ముందుంటారనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది.

అనాథ శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై

author img

By

Published : Feb 1, 2021, 5:19 PM IST

Updated : Feb 1, 2021, 5:38 PM IST

తల్లిదండ్రులు చనిపోయినా పట్టించుకోని పిల్లలున్న ఈరోజుల్లో ఓ మహిళా ఎస్సై అనాథ శవాన్ని భుజంపై మోసుకెళ్లారు. ఈ ఘటన ఏపీ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. కాశీబుగ్గ సమీపంలోని అడవి కొత్తూరు గ్రామంలో 60 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందినట్లు ఎస్సై శిరీషకు సమాచారం అందింది. దీంతో ఈరోజు ఆమె అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

మూర్తీభవించిన మానవత్వం.. అనాథ శవాన్ని మోసిన మహిళా ఎస్సై

దీంతో లలిత చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకుల సాయంతో మృతదేహాన్ని ఎస్సై శిరీష తన భుజంపై మోసుకుంటూ పొలంగట్ల మీదుగా సుమారు 2కి.మీ తీసుకెళ్లి సమీపంలోని రోడ్డుపైకి చేర్చారు. అనంతరం మృతదేహాన్ని ట్రస్ట్‌ సభ్యులకు అప్పగించడంతో వారు అంత్యక్రియలు నిర్వహించారు. ఓ మహిళా ఎస్సై అనాథ మృతదేహాన్ని తన భుజాలపై మోసుకుంటూ వెళ్లడాన్ని చూసిన పలువురు ఆమెను అభినందిస్తున్నారు. మానవత్వం చాటుకున్న ఎస్సై శిరీషను ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇతర అధికారులు అభినందించారు. మృతదేహాన్ని ఎస్సై మోసుకెళ్తున్న వీడియోను ఏపీ పోలీస్‌శాఖ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

ఇదీ చదవండి: ఆ సీనియర్ సిటిజన్లకు రిటర్నుల నుంచి విముక్తి

Last Updated : Feb 1, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.