ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బెల్లంకొండ పంచాయతీ కార్యదర్శి దుర్గారావుపై.. ఓ మహిళ దాడి చేసింది. వితంతు పింఛను మొత్తాన్ని ఇంటికి తెచ్చి ఇవ్వాలంటూ కార్యదర్శిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అలా కుదరదని... కార్యదర్శి చెప్పగా... కార్యాలయానికి కుమారుడితో కలిసి వెళ్లి దుర్గారావుపై దాడి చేసింది. ఈ మేరకు బెల్లంకొండ పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ కార్యదర్శి దుర్గారావు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. పింఛను కోసం వెళ్లిన తనతో... దుర్గారావే అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు సదరు మహిళ ఫిర్యాదు చేసింది.
ఇదీ చూడండి: సోనియా ఎన్నిక పట్ల టీ-కాంగ్రెస్ శ్రేణుల హర్షం