WOMAN ATTACK ON BUS DRIVER: వాహనం చేతిలో ఉంటే చాలు.. మాకు ఎవరితో పని లేదు అనుకుంటున్నారు నేటి యువత. వాళ్లకు ఎవరైనా అడ్డం వచ్చినా లేక వారి బండిని ఓవర్ టేక్ చేసినా.. వాళ్ల అంతుచూసే దాకా ఆగడం లేదు. మనుషులమనే విచక్షణ కోల్పోయి.. దాడి చేస్తున్నారు. మొన్న హైదరాబాద్‌లో ఆటోను పక్కకు తీయమన్నందుకు ఓ డ్రైవర్ విచక్షణ కోల్పోయి.. బస్సు డ్రైవర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన మరువక ముందే విజయవాడలో ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. నా బండినే గుద్దుతావా అని ఓ మహిళ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది.
అసలేం జరిగిందంటే: విజయవాడలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఆర్టీసీ బస్సు.. తన బైకును ఢీకొట్టిందంటూ ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోతూ బస్సును ఆపింది. అనంతరం బస్సు డ్రైవర్‌ను చితకబాదింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి:
మద్యం మత్తులో 60 అడుగుల టవర్ పైనుంచి పడిన యువకుడు
'ఆపరేషన్ ఆకర్ష్' ప్రారంభించిన భాజపా.. అసంతృప్త నేతలపై కన్ను..