ETV Bharat / city

అమరావతిలో వెచ్చించిన వేల కోట్ల సంగతేంటి?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి ప్రభుత్వం నుంచి ఇదమిత్థంగా సమాధానం లేదు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని మాత్రమే చెబుతోంది. కేవలం శాసనసభ సమావేశాలకు వేదిక అయితే.. ఏడాదిలో గరిష్ఠంగా 50-60 రోజులపాటు అధికారిక కార్యకలాపాలుంటాయి. అదీ ప్రభుత్వం ఏడాదిలో అన్ని సెషన్లూ అమరావతిలో జరపాలనుకుంటేనే! ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటించి పనులను పరిశీలించారు. వాటి భవిష్యతేంటి? వాటిని ఏం చేయబోతున్నారో సూచనప్రాయంగానైనా చెప్పలేదు.

what-about-amaravati in andhra pradesh
అమరావతిలో వెచ్చించిన వేల కోట్ల సంగతేంటి?
author img

By

Published : Aug 2, 2020, 7:08 AM IST

అమరావతి ‘శాసన రాజధాని’కే పరిమితమైతే.. ఒక భవనం సరిపోతుంది. శాసనసభ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు ఇప్పటికే భవనాలున్నాయి. నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనాలు, అధికారిక బంగ్లాలు, అతిథి గృహాలు, ఉద్యోగుల అపార్ట్‌మెంట్‌ టవర్లు ఏమవుతాయి? రహదారులు, వారధుల వంటి ఇతర మౌలిక వసతుల పరిస్థితేంటి? ఏడాదికిపైగా నిర్వహణ లేక తుప్పలు మొలుస్తున్న ఆ నిర్మాణాలన్నీ కాలగర్భంలో కలసిపోవడమేనా? రాజధాని ప్రణాళికలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యుత్‌, పైప్‌లైన్ల వంటి పనులకు వెచ్చించిన రూ.10వేల కోట్లకుపైగా ప్రజాధనం వృథాయేనా? రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాల భూముల పరిస్థితేంటి? వారికి సీఆర్‌డీఏ కేటాయించిన స్థలాల సంగతేంటి? ఇవన్నీ రాజధాని ప్రజలతోపాటు, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారిని మదిని తొలుస్తున్న ప్రశ్నలు.

కళ్ల ముందే కరిగిన స్వప్నం!

సాధారణ ఎన్నికలకు ముందు అమరావతి ఓ సజీవ స్రవంతి. ఎటు చూసినా వేల సంఖ్యలో కార్మికులు.. రాత్రింబవళ్లు కొనసాగుతున్న నిర్మాణాలు.. యంత్రాలు, వాహనాల రణగొణ ధ్వనులు.. రాజధానిని చూసేందుకు వచ్చే సందర్శకులతో సందడిగా ఉండేది. ఆదివారం వచ్చిందంటే తుళ్లూరు, మందడం గ్రామాలకు సరకుల కొనుగోలుకు వచ్చే కార్మికులు, ఉద్యోగులతో వీధులన్నీ నిండిపోయేవి. కానీ ఒక్కసారిగా పరిస్థితి తల్లకిందులైంది. ఇప్పుడు అక్కడ అంతటా నిశ్శబ్దం. భారీ సౌధాల నిర్మాణానికి తవ్విన పునాదులన్నీ ఇటీవలి వానలకు నిండి కుంటలను తలపిస్తున్నాయి. నిర్మాణాలు, నిర్మాణ సామగ్రి, క్రేన్‌లు, భారీ వాహనాలు, వేల టన్నుల ఉక్కు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. రహదారుల్లో డివైడర్ల కోసం వదిలిన స్థలాల్లో పిచ్చి మొక్కలు మొలిచాయి. బ్రిడ్జీల కోసం తవ్విన గుంతల్లో నీళ్లు చేరి తటాకాల్ని తలపిస్తున్నాయి.

ఇవీ.. ఇప్పటికే చేసిన పనులు!

  • 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన ఇంటెరిమ్‌ గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌. సచివాలయం, శాసనసభ భవనం ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి.
  • స్థానిక కోర్టుల కోసం ఉద్దేశించిన భవన నిర్మాణం పూర్తి కాగా 2019 మార్చి నుంచి అందులో హైకోర్టు పని చేస్తోంది.
  • 8 వరుసల్లో నిర్మిస్తున్న ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) 18 కి.మీ. పొడవునా ఆరు వరుసల మేర రూపుదిద్దుకుంది. తొలి ప్యాకేజీలోని మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 4 కి.మీ. పొడవున నిర్మాణం 15 నెలలుగా ఆగిపోయింది. ఈ దారికిరువైపులా పిచ్చి మొక్కలు మొలిచాయి.
  • రైతులకు స్థలాలిచ్చిన లేఅవుట్‌లలో మౌలిక వసతుల అభివృద్ధి, ఐకానిక్‌ భవనాలుగా డిజైన్‌ చేసిన హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణం వంటి రూ.41,678 కోట్ల విలువైన 62 ప్రాజెక్టులు నిలిచిపోయాయి.
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఇతర అధికారులు, ఉద్యోగుల కోసం చేపట్టిన అపార్ట్‌మెంట్‌ టవర్ల నిర్మాణాలు 55 నుంచి 90 శాతం వరకు పూర్తయ్యాయి.
  • మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల కోసం నిర్మిస్తున్న భవనాల నిర్మాణం 30 శాతం పూర్తయింది.
  • హైకోర్టు భవనం, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్‌లలో ఐదింటికి పునాదులు వేశారు. వీటికి రూ.120 కోట్లు వెచ్చించారు.

ఇదీ చదవండి: జీవో 203ని కాంగ్రెస్​ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది: భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.