ETV Bharat / city

మిల్లుల్లోనే ధాన్యం మొలకెత్తుతున్నా.. ఎవరికీ పట్టదే..? - తెలంగాణ రైస్ మిల్లుల్లో తడిసిన ధాన్యం

Wet Paddy in Rice mills : కేంద్ర సర్కార్ జాప్యం.. రాష్ట్ర ప్రభుత్వ అయోమయం వెరసి.. రాష్ట్రంలో ధాన్యం నిల్వలపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. మిల్లుల్లో కుప్పలు తెప్పలుగా నిల్వ ఉన్న ధాన్యమంతా మొన్నటి వరకు కురిసిన వానలకు తడిసిముద్దయింది. చాలా మిల్లుల్లో ధాన్యమంతా మొలకలు వచ్చింది. తడిసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడం కష్టం. అందుకే తడిసిన ధాన్యాన్ని వేలం వేసి వచ్చిన మొత్తంతో సరిపెట్టుకునే యోచనలో ఉంది రాష్ట్ర పౌరసరఫరాల శాఖ.

Wet Paddy in Rice mills
Wet Paddy in Rice mills
author img

By

Published : Jul 20, 2022, 7:53 AM IST

Wet Paddy in Rice mills : కేంద్రం బియ్యం సేకరణను తేల్చలేదు. ధాన్యం నిల్వలను ఏమి చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అయోమయం వీడలేదు. రాష్ట్రంలోని మిల్లుల్లో కుప్పలు తెప్పలుగా ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద మొత్తంలో ధాన్యం తడిసిపోయింది. బస్తాల్లోనే ధాన్యం మొలకెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.పది వేల కోట్లు వెచ్చించి 50.67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వ చేసింది. అప్పటికే మరో 40 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యం నిల్వలు మిల్లులో ఉన్నాయి.

Wet Paddy in Telangana Rice mills : యాసంగి ధాన్యం ఉప్పుడు బియ్యంగా మార్చటం దశాబ్దాలుగా ఆనవాయితీ. నిల్వలు భారీగా ఉన్న నేపథ్యంలో ఈ సీజనులో ఉప్పుడు బియ్యం స్థానంలో సాధారణ బియ్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేయటంతో సమస్య ఏర్పడింది. అప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. వడ్లు కొనుగోలు చేయకపోతే రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వమే కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ మేరకు చర్యలు తీసుకుంది.

ఎటూ తేల్చని కేంద్రం.. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని రేషన్‌ కార్డుదారులకు ఇవ్వకపోవడంతో పాటు ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లపై చర్యలు తీసుకోని కారణంగా బియ్యం సేకరణ నిలిపివేస్తున్నట్లు గత నెల 7న ఎఫ్‌సీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి కేంద్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. బియ్యం సేకరణను పునరుద్ధరించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల మొదటి వారంలో దిల్లీలో ప్రకటించినా ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ కాలేదు.

2020-21 యాసంగి ధాన్యంతో పాటు వానాకాల వడ్లకు సంబంధించి కొంత మొత్తంలో బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇచ్చారు. ఆ ధాన్యానికి తోడు ప్రస్తుత ఏడాదికి సబంధించిన యాసంగి ధాన్యాన్ని పెద్ద మొత్తంలో ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాచివేత ధోరణి కారణంగా మిల్లింగ్‌ నిలిచిపోవడంతో మిల్లులు దాదాపు మూతపడ్డాయి.

తర్జనభర్జనలు వీడని రాష్ట్ర ప్రభుత్వం.. మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని వేలం వేయాలా? మిల్లింగ్‌ చేయించాలా? అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీనిపై రెండున్నర నెలల కిందట సీఎస్‌ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ తరవాత మంత్రుల బృందం రంగంలోకి దిగింది. అయినా తుది నిర్ణయం వెలువడలేదు.

వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మార్చడం సాధ్యం కాదు. ఈ కారణంగా మిల్లర్లకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రభుత్వమే బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి ధాన్యం కొనుగోలు చేయించినందున సర్కారుపైనే భారం పడుతుంది. తడిసిన ధాన్యాన్ని వేలం వేసి వచ్చిన మొత్తంతో సరిపెట్టుకోవడమే మార్గమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పౌరసరఫరాల అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో సుమారు పది లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిసినట్లు తేలింది. ధాన్యం తడవకుండా మిల్లర్ల ద్వారా జాగ్రత్త తీసుకునేలా అధికారులు చర్యలు చేపట్టలేదన్న విమర్శలు సైతం లేకపోలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.