హైదరాబాద్ నగర శివారు మణికొండ మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేస్తామని పురపాలిక ఛైర్మన్ కస్తూరి నరేందర్ చెప్పారు. ఛైర్పర్సన్గా కస్తూరి నరేందర్, డిప్యూటీ ఛైర్మన్గా కొండకల నరేందర్రెడ్డిలు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మున్సిపాలిటీలో మంచినీటి సమస్య పరిష్కరిస్తామని... తమకు మణికొండ అభివృద్ధి ముఖ్యమని... అన్ని పార్టీలతో కలసిమెలసి పనిచేస్తామని ఛైర్మన్ వివరించారు.
మణికొండ మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులుండగా... 8 స్థానాల్లో కాంగ్రెస్, 6 చోట్ల భాజపా గెలిచింది. ఈ రెండు పార్టీలు ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్ పదవులను పంచుకున్నాయి.
ఇదీ చూడండి: నిర్భయ దోషులకు ఉరి శిక్ష మళ్లీ వాయిదా