బల్దియా ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుంటామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 12న మేధోమథనం నిర్వహిస్తామన్నారు. ఎన్నికల్లో హైదరాబాద్ అభిృద్ధి అంశంపై కాకుండా మతపరమైన తాత్కిలిక భావోద్వేగాలు రెచ్చగొట్టి ఇతర పార్టీలు లబ్ధిపొందాయని భట్టి ఆరోపించారు.
సైద్ధాంతికంగా కాంగ్రెస్‌దే విజయమని స్పష్టం చేశారు. జానారెడ్డి పార్టీ మారుతారనే వార్తలను ఖండించారు. పీసీసీ అధ్యక్షుడి నియమాకాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
ఇదీ చదవండి : హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చాల్సిందే: బండి సంజయ్