ఏపీ రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ 14రోజులుగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వారికి మద్దతు తెలిపేందుకు ఇవాళ రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటించారు. ఎర్రబాలెంలో మహిళా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ఓ మహిళ రైతు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సర్కారు నిర్ణయాల వల్ల తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పింది. ముఖ్యమంత్రి జగన్ తమకు వద్దొని ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం పదవి నుంచి జగన్ దిగిపోవాలని డిమాండ్ చేసింది. లేదంటే తాము చచ్చిపోతామని గద్గగ స్వరంతో చెప్పింది. అమరావతే రాజధానిగా కొనసాగించాలని కోరింది. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని... తమకు న్యాయం చేయాలని ఆకాంక్షించింది.
ఇదీ చదవండి:అమరావతిపై అంత కక్ష ఎందుకు?: పవన్‌కల్యాణ్