పురపాలక ఎన్నికల ప్రచారంలో మాటలు ఎన్నైనా చెప్పవచ్చని.. చేతలు మాత్రం 25న ఫలితాల్లో తెలుస్తుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కొన్నేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలు ప్రజల కనీస అవసరాలు తీర్చకుండా వెళ్లారని.. ప్రస్తుతం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు.
కొత్త మున్సిపల్ చట్టం కఠినంగా అమలు చేస్తామని.. గ్రీనరీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్లు కేటీఆర్ వెల్లడించారు. పట్టణ ప్రగతితో.. పట్టణాలను అందగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వచ్చే నాలుగేళ్లు ఎన్నికలు లేవని కొత్త మున్సిపాలిటీ చట్టం సక్రమంగా అమలు కావాలంటే తెరాసకు ఓటు వేయాలని సూచించారు. పల్లెలు, పట్టణాలు అభివృద్ధికి దూరంగా ఉండటానికి కాంగ్రెస్, భాజపాలే కారణమని ఆరోపించారు.
మా విజయాలు, విపక్షాల వైఫల్యాలు
- రాష్ట్ర వ్యాప్తంగా పలెల్లో కరెంటు వెలుగులు తెచ్చింది తెరాస
- రాష్ట్రంలో 90 మిని ట్యాంక్ బండ్లు నిర్మాణాలు
- రూ. 18 వేల కోట్లతో 2లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది
- హైదరాబాదు చుట్టూ 25 పార్కులు ఏర్పాటు
- రెండు పడక ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ
- రాష్ట్రంలో చెరువులు, కుంటలు సుందరీకరణ
- కేంద్రంలో భాజపా అధికారంలో ఉండగా.. రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వలేదు.
- దాదాపు 25 పట్టణాల్లో లక్ష్మణ్, ఉత్తమ్ పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టలేక పోయారు.
- రూ.5 భోజనం.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మెచ్చుకున్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: దుండిగల్లో దండిగా ఓట్లు పడేది ఏ పార్టీకి...?