గోదావరి జలాల సరఫరాలో అంతరాయం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు తాగు నీటి సరఫరా నిలిపివేయనున్నట్టు జలమండలి అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా గ్రావిటీ కెనాల్ నిర్మాణం వల్ల నగరానికి వచ్చే పైపులైన్ అడ్డుగా వస్తోంది. అందుకే అక్కడ నుంచి పైపు లైన్ తొలగించి మరో చోటకు మార్చనున్నారు. దీని వల్ల తాగు నీటి సరఫరా ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిలిపివేస్తామని జలమండలి అధికారులు వెల్లడించారు.
ఈ ప్రాంతాల్లోనే
ఎర్రగడ్డ, బోరబండ, ఎల్లారెడ్డిగూడ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, చింతల్, జీడిమెట్ల, షాపూర్‌నగర్, గౌతంనగర్, ప్రశాంత్‌నగర్, మల్కాజిగిరి, అల్వాల్, కైలాసగిరి, హఫీజ్‌పేట్, మియాపూర్, చందానగర్, పటాన్‌చెరు, బొల్లారం, నిజాంపేట్, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు వివరించారు.
- ఇదీ చూడండి : శ్రీశైలంలో కొనసాగుతున్న వరద.. 3 గేట్లు ఎత్తివేత