కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జిల్లాలో భారీ వర్షాల ధాటికి 40 వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి చేరుతోంది. సోమవారం మధ్యాహ్నానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తుందని జలాశయం అధికారులను కేంద్ర జల సంఘం హెచ్చరించింది.
ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ వంద టీఎంసీలు కాగా.. ఇప్పటికే 99 టీఎంసీల నీటిని నిలువ చేశారు. ఆదివారం రాత్రి మూడు గేట్లను తెరిచిన అధికారులు... ఇన్ ఫ్లో పెరగడంతో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు పదిగేట్లు ఎత్తి, 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువలకు నీటి ప్రవాహం కొనసాగుతోంది.
ఇదీచదవండి.