ETV Bharat / city

ఈ-కామర్స్‌ దిగ్గజాల చూపు.. రాజధాని వైపు.. - flipkart warehouse in hyderabad

ప్రస్తుతం దేశీయ నిర్మాణ రంగంలో కొత్త ఒరవడి మొదలైంది. ఇప్పటివరకు రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణాల వైపు ఆసక్తి చూపిన డెవలపర్లు.. తాజాగా వేర్​హౌస్, ఇండస్ట్రియల్ లాజిస్టిక్ వైపు దృష్టి సారిస్తున్నాయి.. ఈ-కామర్స్, రిటైల్, అప్పెరల్, ఎఫ్ఎంసీజీ, లైట్ ఇంజనీరింగ్ విభాగాలు శరవేగంగా వృద్ధి చెందడం వల్ల హైదరాబాద్​లో వేర్​హౌస్ అండ్ లాజిస్టిక్స్ నిర్మాణాలు శవవేగంగా విస్తరిస్తున్నాయి.

రాజధానిపై మొగ్గుచూపుతున్న ఈ-కామర్స్‌ దిగ్గజాలు
author img

By

Published : Oct 15, 2019, 7:31 PM IST

Updated : Oct 15, 2019, 8:16 PM IST

ఈ-కామర్స్‌ దిగ్గజాల చూపు.. రాజధాని వైపు..

వేర్​హౌస్ మార్కెట్​లో హైదరాబాద్​కి ప్రత్యేక స్థానముంది. ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే ఇక్కడ స్థలాల కొరత లేకపోవడం, ధరలు అందుబాటులో ఉండటం, అద్దెలు తక్కువగా ఉండటం, ట్రావెల్ కనెక్టివిటీ మెరుగ్గా ఉండటం లాభిస్తోంది. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు వంటివి కంపెనీలను, పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.

అమెజాన్, ఫ్లిప్​కార్ట్ వంటి సంస్థల వేర్​హౌస్​లు ఇక్కడే...

ఫ్లిప్​కార్ట్, అమెజాన్ లాంటి ఈ-కామర్స్ కంపెనీలతోపాటు ఐకియా వంటి స్టోర్స్ కూడా నగరం సరిహద్దుల్లో గిడ్డంగులను ఏర్పాటు చేసుకున్నాయి. తాజాగా ఇబ్రహీంపట్నంలోని మంగలపల్లిలో హెచ్ఎండీఏ, ఆన్కాన్ గ్రూపు సంయుక్తంగా రాష్ట్రంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ వేర్​హౌస్​ను ప్రారంభించాయి. త్వరలో హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో వచ్చే ఐదేళ్లలో 2 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగులను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఓఆర్ఆర్​తో ఎన్నో సానుకూలతలు..

ఇప్పటికే ఫార్మా, బయోటెక్నాలజీ కంపెనీలకు హైదరాబాద్ హబ్​గా మారింది. వీటితోపాటు ఈ-కామర్స్ రంగాలు ప్రవేశించడంతో సిటీలో వేర్​హౌస్ మార్కెట్​కు డిమాండ్ పెరిగింది. రకరకాల రవాణా మధ్యమాలు బాహ్యవలయ రహదారికి అనుసంధానం కావటం వల్ల.. త్వరలో ఔటర్ చుట్టూ మరో 8 వేర్​హౌస్లు రానున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తయారీ, రిటైల్ రంగాలకు గిడ్డంగుల డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ వేర్​హౌస్ మార్కెట్ రోజురోజుకీ విస్తరిస్తోందని కేటీఆర్ అన్నారు.

పారిశ్రామిక రంగ హోదా వల్లే...

అమెజాన్.. తన దక్షిణాది మార్కెట్​కు సరిపోయే రెండు లాజిస్టిక్ సెంటర్లను హైదరాబాద్ శివార్లలోనే ఏర్పాటు చేసుకుంది. అలాగే ఫ్లిప్​కార్ట్​ లాంటి సంస్థలు తమ వేర్​హౌస్​లను ఇక్కడే ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నాయి. వేర్​హౌస్​, లాజిస్టిక్ రంగాలకు మౌలిక, పారిశ్రామిక రంగ హోదా ఇవ్వడం వల్ల ఈ సెక్టార్​కు డిమాండ్ పెరిగిందనుకోవచ్చు.

రియల్ ఎస్టేట్​లో రెసిడెన్షియల్, కమర్షియల్ మార్కెట్​లతోపాటు వేర్​హౌజ్​ మార్కెట్లో హైదరాబాద్ ముందుండటం శుభ పరిణామం.

ఇదీ చదవండిః లాజిస్టిక్స్‌ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Intro:Body:Conclusion:
Last Updated : Oct 15, 2019, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.