ETV Bharat / city

నడిరోడ్డుపై వాలంటీర్​ వీరంగం.. మహిళా ఎస్సైతో అసభ్య ప్రవర్తన​. - ఆత్మకూరులో వార్డు వాలంటీర్ అరెస్టు

మద్యం మత్తులో వార్డ్​ వాలంటీర్​ రెచ్చిపోయాడు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహిస్తున్న మహిళా ఎస్సైను అసభ్య పదజాలంతో దూషించాడు. వాలంటీర్​ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే మంగళవారం రాత్రే ఆ సీఐ బదిలీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

నడిరోడ్డుపై వాలంటీర్​ వీరంగం.. మహిళా ఎస్సైతో అసభ్య ప్రవర్తన​.

author img

By

Published : Jul 8, 2020, 9:55 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మహిళా ఎస్సై పట్ల స్థానిక 21వ వార్డు వాలంటీర్ అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో బూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు. సోమవారం అర్ధరాత్రి ఎస్సై రోజాలత పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా... మద్యం సేవించి అటుగా వచ్చిన వాలంటీర్‌ను పోలీసు సిబ్బంది ఆపారు. రెచ్చిపోయిన వాలంటీర్‌ ఎస్సైని దుర్భాషలాడాడు. మహిళా ఎస్సై అని కూడా లేకుండా తిట్ల పురాణం అందుకున్నాడు. నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. నడిరోడ్డుపై చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు.

మహిళా ఎస్సైను దూషించిన వాలంటీర్​పై కేసు నమోదు చేసినట్లు సీఐ పాపారావు తెలిపారు. వాలంటీర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అయితే మంగళవారం రాత్రి సీఐ బదిలీ కావడం చర్చనీయాంశం అయింది. వాలంటీర్​ను అదుపులోకి సీఐను గుంటూరు రేంజ్​ కార్యాలయానికి ఎటాచ్ చేశారు.

నడిరోడ్డుపై వాలంటీర్​ వీరంగం.. మహిళా ఎస్సైతో అసభ్య ప్రవర్తన​.

ఇదీ చదవండి : తల్లితోనే కాదు.. తాను గుళికలు తాగిన కుమారుడు.. ఇద్దరూ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.