Vundavalli Arun Kumar Comments: విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయంపై రాష్ట్ర పార్టీలు గళమెత్తాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. సాక్షాత్తూ ప్రధానమంత్రే అన్యాయం జరిగిందని అన్నారని.. ఆయన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో చర్చకు కోరాలని సూచించారు. ప్రధాని వ్యాఖ్యలపై చర్చ జరిగితే.. ఏపీకి జరిగిన అన్యాయం దేశానికి తెలుస్తుందని ఉండవల్లి అన్నారు. అన్యాయం చేసిన వాళ్లే అన్యాయం జరిగిందంటున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
"రాష్ట్ర విభజన తీరుపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి. పార్లమెంట్‌లో రాష్ట్ర పార్టీలు గళమెత్తాలి. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై చర్చకు కోరాలి. చర్చ జరిగితే అన్యాయం దేశానికి తెలుస్తుంది. అన్యాయం చేసిన వాళ్లే అన్యాయం జరిగిందంటున్నారు. అన్యాయంపై అడగటానికి రాష్ట్ర పార్టీలకు భయం ఎందుకు..? మౌనంగా ఉంటే ముందు తరాలు దారుణంగా నష్టపోతాయి. ఆంధ్రాకు ఏం చేసినా అడిగేవాడు లేడని అనుకుంటారు"
- ఉండవల్లి అరుణ్ కుమార్
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు...
ఆంధ్రప్రదేశ్ విభజనపై మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారన్నారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని వ్యాఖ్యనించారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్న మోదీ.. ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరు సరికాదన్నారు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని ఆక్షేపించారు. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని..,కానీ ఎవరికీ నష్టం కలగకుండా శాంతియుత వాతావరణంలో రాష్ట్రాల ఏర్పాటు జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సరిగ్గా విభజన చేసి ఉంటే సమస్యలు వచ్చేవి కావని అన్నారు.
"మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ర్పే వాడారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనం. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. శాంతియుత వాతావరణంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశాం. ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరు సరికాదు. సరిగ్గా విభజన చేసి ఉంటే సమస్యలు వచ్చేవి కావు."
- నరేంద్ర మోదీ, ప్రధాని
ఇదీ చూడండి: