ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలా? లేదా? అన్న అంశంపై ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు విశేష స్పందన లభిస్తోంది. ‘ఆంధ్రప్రదేశ్ విత్ అమరావతి’ పేరుతో నిర్వహిస్తున్న ఈ అభిప్రాయ సేకరణలో... నాలుగు రోజుల వ్యవధిలోనే సుమారు 3.68 లక్షల మంది పాల్గొన్నారు. వారిలో 94.36 శాతం మంది రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని అభిప్రాయపడ్డారు. apwithamaravati.com వెబ్‌సైట్‌ను తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం సాయంత్రం ప్రారంభించారు. దాన్ని తెదేపా సామాజిక మాధ్యమాల విభాగం ఆన్‌లైన్ వేదికలపైకి విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లింది.
ఇందులో ‘అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు, అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా మీరు కోరుకుంటున్నారా?’ అన్న ఒకే ఒక్క ప్రశ్న ఉంటుంది. దాని కింద అవును/కాదు అన్న ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఒకదానిపై క్లిక్ చేస్తే అభిప్రాయం నమోదవుతుంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 3,68,794 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.
ఒకరు ఒకసారే..
ఒకరు ఒకసారి మాత్రమే ఓటేసేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఓటింగ్‌లో పాల్గొన్నవారి పేరు, ఫోన్ నంబరు, వారు ఏ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవారు? వయసు, మహిళలా? పురుషులా? అన్న వివరాలు నమోదు చేయాలి. చివర్లో ఒక బాక్స్‌లో కోడ్ నంబర్ ఉంటుంది. దాన్ని నమోదు చేసిన తర్వాతే ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఇవీ చూడండి: 'సీజనల్ వ్యాధులు తగ్గించటంలో ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి'