తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ఆలోచించాడు ఓ మందుబాబు. అంతేకాదు దానిని ఆచరించిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏపీలోని అనంతపురం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు(mptc zptc results in ap 2021) ప్రక్రియలో అతడు చేసిన పని వెలుగులోకి రావడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది బ్యాలెట్ బాక్సులో ఒక చీటీని గమనించారు. ఏంటా అని తెరిచి చదివారు.. అందులో ఉన్న విషయాన్ని చదివి అవాక్కయ్యారు. ఓటుతో పాటు మందుబాబులు తమ ఇబ్బందికి సంబంధించిన విజ్ఞప్తిని జతపరచి.. సమస్యను పరిష్కరించాలంటూ కోరాడు.
ఆ మందుబాబు విజ్ఞప్తి ఏంటంటే...
రాష్ట్రంలో ప్రభుత్వం తెచ్చిన వివిధ రకాల మద్యం బ్రాండ్లతో విసుగెత్తిపోతున్నామని ఓ మందుబాబు గోడు వెళ్లగక్కాడు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న మద్యాన్ని నిలిపివేసి.. మంచి బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరాడు. తమ ప్రాంతంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో శీతల బీరులతో.. పాటు మంచి బ్రాండ్ మద్యాన్ని అందుబాటులో ఉంచాలని.. నల్లచెరువు మండలంలోని తలమర్లవాండ్లపల్లి ఎంపీటీసీ పరిధిలోని ఓ మందుబాబు ప్రభుత్వానికి సూచించాడు. చీటీలో నల్లచెరువు యూత్ మందుబాబులు అంటూ రాసి సంతకం చేశాడు. ఈ చీటీని ఓటుతో పాటు బ్యాలెట్ బాక్సులో వేశాడు.
ఇదీ చదవండి: