Volunteer fire on officers: ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం యర్రదొడ్డిలో 12 వందల మందికి పైగా రైతులు ఉన్నారు. కానీ పదుల సంఖ్యలో రైతులకు మాత్రమే బీమా వచ్చింది. వ్యవసాయశాఖ, సచివాలయ ఉద్యోగుల వల్లే అర్హులకూ పరిహారం అందలేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. సచివాలయానికి తాళం వేశారు. అదే సమయంలో బోడేనాయక్ తండా వాలంటీర్ నాగేష్ నాయక్ అక్కడికి వచ్చారు. తన క్లస్టర్ పరిధిలోని రైతులకు బీమా ఇప్పించలేకపోయానంటూ ఆవేదన చెందారు. రైతులకు అన్యాయం జరిగిన విషయం సచివాలయ ఉద్యోగులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో... ఈ ఉద్యోగానికో దండం అంటూ చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపారు.
ఇవీ చదవండి:
బార్‌లో పరస్పరం దాడి చేసుకున్న యువతి, యువకులు... చివరికీ..
ఏకే-47 కేసులో ఎమ్మెల్యేకు పదేళ్లు జైలు శిక్ష- పదవి పోవడం ఖాయం!