ETV Bharat / city

'పోలీసులు, సిట్‌ అధికారులు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించారు' - YS Viveka murder case updates

YS Viveka murder case : వై.ఎస్‌.వివేకా హత్య కేసును తొలుత దర్యాప్తు చేసిన రాష్ట్ర పోలీసులు, సిట్‌ అధికారులు... తానివ్వని వాంగ్మూలాలను ఇచ్చినట్లు సృష్టించారని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. ఆయన రాష్ట్ర పోలీసులకు ఇచ్చినట్లుగా ఉన్న వాంగ్మూలాల ప్రతుల్ని విచారణలో భాగంగా సీబీఐ అధికారులు రాజశేఖర్‌రెడ్డికి చూపించారు. వాటిని పరిశీలించిన ఆయన …. తానెప్పుడూ అలా వాంగ్మూలాలు ఇవ్వలేదన్నారు. పోలీసులే ఆయా అంశాలను సృష్టించారంటూ వివరించారు. ఈ మేరకు గతేడాది వివిధ సందర్భాల్లో సీబీఐ అధికారులకు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ఆ అంశాలు తాజాగా వెలుగుచూశాయి.

YS Viveka murder case
YS Viveka murder case
author img

By

Published : Mar 5, 2022, 8:50 AM IST

YS Viveka murder case: పోలీసులకు, సిట్ అధికారులకు తాను వాంగ్మూలం ఇవ్వలేదని... వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి తెలిపారు. అందులో ఉన్న అంశాలన్నీ పోలీసులు సృష్టించినవేనన్నారు. 2019 మార్చి 15న సీఐ శంకరయ్యకు తాను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదన్నారు. 2019 మార్చి 16న మాత్రమే ఆయనకు వాంగ్మూలం ఇచ్చానన్న ఆయన... అందులో ఉన్న అంశాలు తాను చెప్పినవి కాదన్నారు. వారు సృష్టించినవేనన్నారు. వివేకా చనిపోయారంటూ ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి 2019 మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల15 నిమిషాల సమయంలో తనకు ఫోన్‌ చేసి చెప్పారన్నారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని ఇంట్లో ఉన్నానన్న రాజశేఖరరెడ్డి .. ఏడున్నర గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి పులివెందులకు బయల్దేరామని సీబీఐకి తెలిపారు. ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్‌ చేసి వివేకా మరణించారనే విషయం చెప్పేసరికి కర్నూలు వద్ద ఉన్నామని తాను చెప్పినట్లు వాంగ్మూలంలో ఉందన్నారు. అది తప్పు అన్న రాజశేఖరరెడ్డి... ఆయన ఫోన్‌ చేసేటప్పటికి తాము హైదరాబాద్‌లోనే ఉన్నామని తెలిపారు.

నేను అలా ఎప్పుడూ చెప్పలేదు..

YS Viveka murder case News : వివేకా గుండెపోటుతో మరణించారని తాను భావించానని పోలీసులతో చెప్పినట్లు ఆ వాంగ్మూలంలో ఉందన్న నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి... కానీ తాను అలా ఎప్పుడూ చెప్పలేదన్నారు. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ 2019 మార్చి 29న డీఎస్పీ నాగరాజుకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా నమోదు చేశారన్నారు. ఆ రోజున ఆమె కడపలో కానీ, పులివెందుల్లో కానీ లేరని... హైదరాబాద్‌లో ఉన్నారని తెలిపారు. ఘటనా స్థలం వద్ద లభించిన లేఖను తన భార్య సునీత.. ఎంవీ కృష్ణారెడ్డి వద్ద నుంచి తీసుకుని మీడియా ఎదుటే సీనియర్‌ పోలీసు అధికారులకు ఇచ్చినట్లు వాంగ్మూలంలో ఉందన్నారు. సీఐ శంకరయ్య, డీఎస్పీ నాగరాజులు కావాలనే ఈ తప్పుడు వాంగ్మూలాలు సృష్టించారన్నారు. శవ పంచనామా సమయంలో తాము పులివెందుల్లో ఉన్నట్లు చెప్పేందుకు వీలుగా అలా చేశారన్నారు. వాస్తవంగా తాము ఆ సమయంలో హైదరాబాద్‌ నుంచి పులివెందులకు వచ్చే దారిలో ఉన్నామని... ఆ లేఖ గురించి ఏదో దాచిపెట్టాలనే ఉద్దేశంతోనే వారు ఇలా చేశారని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

వివేకా మృతిచెందారని తొలుత ఫోన్‌ చేసి చెప్పింది అతనే..

YS Viveka murder case Updates : వివేకానందరెడ్డి మృతిచెందారని తొలుత తనకు ఫోన్‌ చేసి చెప్పిన ఎంవీ కృష్ణారెడ్డి.. మరోసారి ఉదయం 6 గంటల 23 నిమిషాల సమయంలో ఫోన్‌ చేసి ఘటనా స్థలంలో ఓ లేఖ లభించిందని చెప్పినట్లు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. అందులోని అంశాలు చదివి వినిపించారని... డ్రైవర్‌ ప్రసాద్‌ పేరు ఆ లేఖలో ఉందన్నారు. రెండోసారి ఫోన్‌ చేసినప్పుడు ఎంవీ కృష్ణారెడ్డి వివేకా మృతదేహంపై ఉన్న గాయాలు గురించి చెప్పలేదన్నారు. అప్పటికే కొందరితో మాట్లాడినందున అది సహజమరణం కాకపోవొచ్చనే సందేహం కల్గిందని సీబీఐకి తెలిపారు. దొంగాట ఆడుతున్న వారిని పట్టించాలని... ఆ లేఖ వేరే వారి చేతుల్లోకి వెళ్లకూడదని, డ్రైవర్‌ ప్రసాద్‌పై దాడి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ లేఖను తాము పులివెందులకు చేరేంత వరకూ ఆయన వద్దే భద్రపరచమని కృష్ణారెడ్డికి చెప్పానన్నారు. అదే విషయాన్ని ఆ తర్వాత తన భార్యతో చెప్పానని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.