ETV Bharat / city

పళ్లెంలో ఎన్ని రంగులుంటే.. అంత ఆరోగ్యం... - proteins in color vegetables

పళ్లెంలో ఎన్ని రంగులుంటే అంత ఆరోగ్యం అంటున్నాయి అధ్యయనాలు. అవును.. ముదురు వర్ణాల్లో దాగిన పోషకాల గురించి తెలిస్తే మీ ప్లేటుని రంగుల కాయగూరలూ, ఆకుకూరలతో నింపేయడం ఖాయం..

vitamins in colored vegetables
రంగుల కూరగాయల్లో పోషకాలు
author img

By

Published : Aug 28, 2020, 1:01 PM IST

ఎరుపు, గులాబీ వర్ణాలు

టొమాటో, ఎర్ర ముల్లంగి, క్యాబేజీ, ఉల్లి, రెడ్ పెప్పర్, స్ట్రాబెర్రీ, జామ, పుచ్చకాయ, దానిమ్మ, యాపిల్.. వీటన్నంటిలో ఎరుపు, గులాబీ వర్ణాలకు కారణమయ్యే లైకొపిన్ ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం ఉన్న కాయగూరలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్​లు మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల హృద్రోగాలకు దూరంగా ఉండొచ్చు. క్యాన్సర్ల ముప్పు తప్పుతుంది. ఈ రంగులో ఉండే బైఫ్లెవనాయిడ్లు రక్తపోటు అదుపులో ఉంచటానికి సాయం చేస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. కొలెస్ట్రాల్​ను తగ్గిస్తాయి.

ఊదా

ఈ రంగులో ఉన్న కూరగాయుల, పండ్లలో యాంథో సయనిన్ అనే రసాయం ఉంటుంది. ఈ వర్ణంలో ఉండే వాటికి వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం అధికంగా ఉంటుంది. అందుకే వీటిని సూపర్ ఫుడ్​గా పిలుస్తారు. ఊదా రంగులో ఉండే వంకాయ, ఊదారంగు కాలీఫ్లవర్, బీట్​రూట్, డ్రాగన్​ఫ్రూట్​లలో పీచు, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.

నారింజ, పసుపు

ఈ రంగులో ఉండే చిలగడ దుంపలు, గుమ్మడి, క్యారెట్, బెల్​పెప్పర్, బొప్పాయి, నారింజ, నిమ్మ, మామిడి, పైనాపిల్, మొక్కజొన్నల్లో కెరొటినాయిడ్స్, ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు కంటి జబ్బులు రావు.

ఆకుపచ్చ

ఆకుకూరలు, కూరగాయలు, పండ్లకు ఆకుపచ్చని వర్ణాన్నిచ్చే బీటాకెరొటిన్ చక్కని యాంటీ ఆక్సిడెంట్​గా పనిచేస్తుంది. ఈ రంగు ఆహారం కంటి సమస్యలు రాకుండా చూస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గిస్తుంది. ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఈ ఆహారం పుట్టబోయే శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది.

తెలుపు

ఈ రంగులో ఉండే కాలీఫ్లవర్, పుట్టగొడుగులు, ముల్లంగి, బంగాళాదుంపలు, వెల్లుల్లిలో ఫైటో కెమికల్స్ ఎక్కువగా ఉండి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. కొలెస్ట్రాల్​ని తగ్గిస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.