ETV Bharat / city

కరోనా భయం.. విటమిన్ మందులకు పెరిగిన డిమాండ్ - coronavirus treatment

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో వైద్యులు రోగనిరోధకశక్తి పెంచుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్ సీ, విటమిన్ డీ3 , జింక్ , పల్స్ ఆక్సిమీటర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వినియోగదారులు ఔషధ దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. రోజుకు 500 పల్స్ ఆక్సీమీటర్స్ విక్రయిస్తున్నామని దుకాణదారులు చెపుతున్నారు.

coronavirus
coronavirus
author img

By

Published : Jul 15, 2020, 2:25 PM IST

రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వైరస్ నుంచి ప్రాణరక్షణ పొందేందుకు రోగనిరోధక శక్తి పెంచుకోవటమే ప్రత్యామ్నాయ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సీ, విటమిన్ డీ, జింక్ ఔషధాలు వినియోగించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

విటమిన్ సీ, డీ ఔషధాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని ఔషధ దుకాణదారులు అంటున్నారు. గతంలో రోజుకు 10 మంది వీటి కోసం వచ్చే వాళ్లు ఇప్పుడు 100 మందిలో 60 మంది విటమిన్ సీ, డీ, జింక్ ఔషధాలను కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో 50 పల్స్ ఆక్సీమీటర్లు విక్రయించిన తమ దుకాణంలో 500 విక్రయిస్తున్నామని యజమానులు తెలిపారు.

వృద్ధులు, చిన్నారులు ఉన్న కుటుంబాల్లో మెడికల్ కేర్ కిట్ల పట్ల అవగాహన పెరిగిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ పల్స్ రేటు తగ్గితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తుండటంతో పల్స్ ఆక్సీమీటర్లు అందుబాటులో ఉంచుకుంటున్నామని ప్రజలు అంటున్నారు.

చదవండి : కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.