ETV Bharat / city

parrots pets at home: పచ్చని చిలుకలే ఆయనకు తోడు.. ఈ పక్షిరాజు గురించి మీకు తెలుసా?

చుట్టూ సాగరనగర అందాలు. పచ్చటి కొండలు. తెల్లవారుజామున తనువును తాకే భానుడి నులివెచ్చని కిరణాలు. చలికాలంలో పరుచుకునే మంచు దుప్పటి. ఇంతటి ఆహ్లాదకర వాతావరణానికి రామచిలుకల సందడి తోడైతే..? మనకున్న చికాకులు, కోపాలు, ఒత్తిళ్లు అన్నీ మటాష్..! వందలాది చిలుకలకు సుమారు పదేళ్లుగా ఆతిథ్యమిస్తూ(parrots pets at home) తన పరిసరాలను ఆహ్లాదంగా ఉంచుతున్నారు.... ఓ విశాఖ వాసి.

parrots pets at home, parrot pets
ఇంట్లో చిలుకలకు ఆతిథ్యం, విశాఖ పక్షిరాజు
author img

By

Published : Oct 26, 2021, 7:39 PM IST

పచ్చని చిలుకలే ఆయనకు తోడు

కిటికీలో నుంచి బయటకు చూస్తే మేడలు. రోడ్డుపైకి వస్తే వాహనాల రణగొణధ్వనులు. మనకు మనమే ఏర్పరచుకున్న కాంక్రీట్ జంగిల్ పర్యవసానాలు ఇవి. జీవ వైవిధ్యంపై ఇది కొడుతున్న దెబ్బ మామూలుది కాదు. పక్షులు, ఇతర జీవరాశులను అక్కున చేర్చుకోవాలన్న మనసు ఉండాలే కానీ.. అవి ఇట్టే మనతో కలిసిపోతాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. ఆంధ్రప్రదేశ్ విశాఖకు చెందిన లక్ష్మీనారాయణ. చిలకల్లో తన చిరు స్నేహితులను చూసుకుంటున్న(parrots pets at home) ఈయన.. పదేళ్లకుపైగా వాటి ఆకలి తీరుస్తున్నారు.

మెల్లగా వన్, టూ ఇయర్స్​లో అలా పెరుగుతూ వచ్చాయి. 2010 తర్వాత నుంచి అవి వందల సంఖ్యలోకి వచ్చాయి. మేమెలాగూ రిటైర్ అయ్యాం. వేరే పనేం లేదు. ఏదైనా పని ఉన్నా, ఊరెళ్లినా... మా ఇంట్లో రెంట్​కి ఉండే వారికి లేదా మా అత్తయ్య, మావయ్యలకు అప్పజెప్పి వెళ్తాం. పూర్వ జన్మలో ఏమైన రుణమో ఏమో తెలియదు. వస్తాయి. తింటాయి. మాకూ సంతోషమే. ఏదో సేవ చేస్తున్నాం అనుకుంటాం. అంతకు మించి ఏం లేదు.

-లక్ష్మీనారాయణ, చిలుకల ప్రేమికుడు

విశాఖలోని కృష్ణా కళాశాల సమీపంలో నివసించే లక్ష్మీనారాయణ.. 2008లో తొలుత ఒకట్రెండు చిలుకలకు ఆహారమందించడం ప్రారంభించారు. చూస్తుండగానే వీటి సంఖ్య వందల్లోకి చేరుకుంది. రోజూ 3 సార్లు ఠంచనుగా వచ్చి మేడపై వాలిపోతుంటాయి. చిలుకల సందడి(parrots pets at home) వల్ల.. తమకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని కాలనీవాసులు అంటున్నారు. చిలుకలకు ఆహారం అందించడం ఏమాత్రం శ్రమ కాదని.. అవి రాకపోతే ఏదో వెలితిగా ఉన్నట్టు ఉంటుందని లక్ష్మీనారాయణ అంటున్నారు.

చిలుకలు ఇలా రావడం వల్ల మాకు చాలా హాయిగా ఉంటుంది. చిలుకలే కాకుండా చుట్టూ అంతా పచ్చని వాతావరణం ఉంటుంది. మనం సెల్​ఫోన్లతో డే అంతా ఉంటాం కదా. ఇలాంటి నేచురల్ థింగ్ బయట ఎక్కడా కనిపించదు. ప్రస్తుత పరిస్థితుల్లో జూల్లోను ఇలాంటి వాతావరణం కష్టమే. ఇక్కడైతే చాలా బాగుంటుంది. అవి టైంకి వస్తాయి. మాకేం డిస్ట్రబెన్స్ కాదు. వీటిని చూడడానికి మా ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు.

-ఆశ్రిత, కాలనీవాసి

పాప్​కార్న్ తీసుకొని... కూర్చొని చిలుకల్ని చూస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తాం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మాకు మ్యూజిక్ కూడా అవసరం లేదు. అలాగా టైం ఆటోమేటిక్​గా స్పెండ్ అవుతుంది. అలా చిలుకలు చూస్తూ గడిపేస్తాం.

-స్థానికుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.