ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో వైద్యుడు సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించామని విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సీబీఐకి అందించామన్నారు. డాక్టర్ సుధాకర్ కేసులో పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టడంలేదని స్పష్టం చేశారు. అయినా డా.సుధాకర్ స్థానిక పోలీసు స్టేషన్కి రావటంపై ఆర్కే మీనా అసహనం వ్యక్తం చేశారు.
రాజకీయ నేతల ప్రోద్బలం..
ఈ అంశంపై సీబీఐకి లేఖ రాస్తామని మీనా చెప్పారు. కేసు సీబీఐ పరిధిలో ఉండగా ఎటువంటి సామాన్లు ఇవ్వలేమన్నారు. రాజకీయ నేతల ప్రోద్బలంతో పోలీసు స్టేషన్కి వచ్చి, స్టేషన్ ముందు ప్రసార మాధ్యమాలతో మాట్లాడడం సరికాదన్నారు.
ఇదీ చదవండి : ప్రేమ వివాహం చేసుకుందామని బయల్దేరారు... అంతలోనే...