ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు మండలం బరిసింగికి చెందిన అరుణ... గర్భిణిగా ఉన్న సమయంలో ఎన్నో కష్టాలు పడింది. ఎనిమిదో నెల గర్భం ఉన్న సమయంలోనూ కుటుంబ పోషణ కోసం 15 కిలోల బరువున్న బంతిపూల గంపలను మోసుకుంటూ 5 కిలోమీటర్ల దూరంలోని సంతకు వెళ్లేది. అరుణ కష్టాలను ఈటీవీ భారత్ వెలుగులోకి తెచ్చింది. వరుస కథనాలతో ఆమె సమస్యలను ప్రపంచానికి తెలిసేలా చేసింది.
స్పందించిన మహిళా కమిషన్ సభ్యులు
అరుణ గురించి తెలుసుకున్న మహిళా కమిషన్ సభ్యులు.... బరిసింగికి వెళ్లి ఆమెకు సీమంతం చేశారు. ప్రసవం సమయంలో ఆస్పత్రికి వెళ్లగా... అరుణకు రక్తం సరిపడా లేదని వైద్యులు విశాఖలోని కేజీహెచ్‌కు సిఫార్సు చేశారు. అప్పుడు కూడా... ఆమెకు మాజీ మంత్రి మణికుమారి ద్వారా ఆర్థిక సహాయం అందించి.... అధికారుల సాయంతో రక్తం అందేలా చేసింది ఈటీవీ భారత్. నవంబర్ 30న ఆమె పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది.
రుణం తీర్చుకున్నారు
కష్టాల్లో ఉన్నప్పుడు తనను ఆదుకున్న ఈటీవీ, ఈటీవీ భారత్ రుణం తీర్చుకోవాలన్న అరుణ దంపతులు... తమ కుమార్తెకు భారతి అని పేరు పెట్టారు. అబ్బాయి అయితే భారత్ అని పెట్టేవారమని చెప్పారు. పుట్టుక నక్షత్రం కూడా భారతి నామకరణానికి సరిపోవటంతో వారు అనుకున్న కల నెరవేరింది. ఆదివారం నామకరణ మహోత్సవం జరిపారు.
ఇదీ చూడండి: