సింగపూర్లో శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత విద్వాంసులు గరికపాటి వెంకట ప్రభాకర్ రాగావధానం కార్యక్రమం నిర్వహించారు. వర్చువల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమం 5 గంటలపాటు సంగీత ప్రియులను అద్భుతంగా అలరించింది.
సాహిత్య అష్టావధాన ప్రక్రియలోలాగే.. పలువురు గాయకులు పృచ్ఛకులుగా .. రాధిక మంగిపూడి సమన్వయకర్తగా వ్యవహరించారు. పృచ్ఛకులు అడిగిన పాటలకు అప్పటికప్పు అవధాని.. రాగాన్ని మార్చడం, తాళాన్ని మార్చి పాడటం, రాగమాలిక లేదా తాళమాలిక అల్లి పాడటం వంటి విన్యాసాలతో ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఈ కార్యక్రమం సాగింది. అమెరికా, హాంగ్కాంగ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నార్వే వంటి వివిధ దేశాల్లోని తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో వీక్షించారు.
అమెరికా నుంచి డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, భారత్ నుంచి డాక్టర్ వంశీరామరాజు, ప్రముఖ గాయకుడు జి.ఆనంద్, ప్రఖ్యాత గాయని సురేఖ మూర్తి వంటి పలువురు ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు.
పూర్తి కార్యక్రమాన్ని వీక్షించుటకు:
- ఇదీ చదవండి : తొలిసారి ఆ భాషలో పాట పాడిన దుల్కర్ సల్మాన్