ETV Bharat / city

Viral Video: బాటిల్​లో దూరిన పాము.. తృటిలో తప్పిన ప్రాణాపాయం - తెలంగాణ వార్తలు

ఓ పాము ఖాళీ వాటర్ బాటిలో చేరి హల్​చల్ చేసింది. తెరిచిఉన్న బాటిల్​లోకి చేరిన నల్లత్రాచు... బయటకు రాలేకపోయింది. వెంటనే స్థానికులు స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది.

Viral Video, snake in water bottle
బాటిల్​లో దూరిన పాము, పాము వైరల్ వీడియో
author img

By

Published : Oct 2, 2021, 5:22 PM IST

బాటిల్​లో దూరిన పాము

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సాపురంలోని మెడంకి సర్వేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో మంచంపై ఉంచిన ఖాళీ వాటర్ బాటిల్​లోకి నల్లత్రాచు పాము(SNAKE IN BOTTLE) చేరింది. అది గమనించని అతని భార్య వాటర్ బాటిల్​ని పట్టుకుంది. బాటిల్​లో ఉన్న పాము ఒక్కసారిగా కొంచెం బయటకు రావడంతో ఆమె కేకలు వేసి బాటిల్​ను విసిరేసింది. పాము బాటిల్​లోనే ఉండిపోయింది.

ఆమె కేకలు విని అక్కడకు చేరుకున్న చుట్టుపక్కల వారు ఆ వాటర్ బాటిల్​ మూతపెట్టి బయటకు తీసుకెళ్లారు. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి దానిని కర్రలతో కొట్టి చంపారు. తృటిలో ప్రాణాపాయం తప్పడంతో ఆ కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. బాటిల్​లో దూరి బుసలు కొడుతున్న నల్లత్రాచు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా(snake visuals viral) మారాయి.

ఇదీ చదవండి: MLA Shankar naik: చెట్టుకు ఉరివేసిన వానరాన్ని చూసి చలించిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.