తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి గోపాల్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, తెలంగాణ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జర్నీ ఫేమ్ కథానాయిక అనన్య తదితరులు వీఐపీ ప్రారంభ విరామ దర్శనంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందచేశారు. స్వామి వారి ఆశీస్సులతో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు.