తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ మంత్రులు అనిల్, గౌతమ్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, నటి అనసూయ.. స్వామిని దర్శించుకున్నారు.
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మాజీ క్రీడాకారుడు చాముండేశ్వరీనాథ్ కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు స్వామివారి తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు.
ఇదీ చదవండి : తులసితో తళతళలాడే అందం!