ETV Bharat / city

Venkaiah naidu : 'నన్ను ఈ స్థాయికి చేర్చింది గురువులే' - vice president venkaiah naidu visit in Hyderabad

జాతి నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో కీలకమైనదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah naidu) అన్నారు. ప్రతిఒక్కరు తమకు మార్గదర్శనం చేసిన గురువులను స్మరించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని ఉపాధ్యాయులందరికి శుభాకాంక్షలు తెలిపారు. తాను ఈ స్థాయికి రావడంలో ముఖ్యపాత్ర పోషించిన తన గురువులను ఈ సందర్భంగా వెంకయ్య స్మరించుకున్నారు.

నన్ను ఈ స్థాయికి చేర్చింది గురువులే
నన్ను ఈ స్థాయికి చేర్చింది గురువులే
author img

By

Published : Sep 5, 2021, 12:54 PM IST

గురువుల కారణంగానే తాను ఈ స్థాయికి చేరానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah naidu) అన్నారు. రైతుబిడ్డనైన తనను ఈస్థాయికి చేర్చింది గురువులేనని అన్న వెంకయ్య.. తమ కుటుంబంలో ఎవరూ పాఠశాల విద్య దాటలేదని చెప్పారు. తనకు మార్గదర్శనం చేసిన గురువులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిఒక్కరూ తమకు చదువు నేర్పిన వారిని స్మరించుకోవాలని సూచించారు. గురువులు చూపిన మార్గంలో నడవటమే వారికిచ్చే గొప్ప దక్షిణ అని పేర్కొన్నారు.

హైదరాబాద్​లో.. కరోనా పరిస్థితులపై జరిగిన జాతీయ సదస్సులో వెంకయ్య(Venkaiah naidu) మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి మాట్లాడారు. విద్యార్థుల భవితను తీర్చిదిద్దడంలో వారి కృషిని కొనియాడారు. మన భవిష్యత్​కు మార్గదర్శనం చేసిన గురువులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని చెప్పారు.

"వైద్య వృత్తి చాలా ఉత్కృష్టమైంది. సేవా భావంతో వైద్య వృత్తిని నిర్వర్తించాలి. నాణ్యమైన వైద్య విద్య అందాల్సిన అవసరం ఉంది. వైద్య వృత్తి ద్వారా ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు వైద్యులు మొగ్గు చూపాలి. మహమ్మారి సమయంలో పని చేసిన వైద్యులకు నా అభినందనలు. ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, వైద్య సిబ్బంది పనిచేశారు. మందులతో పాటు.. రోగులకు కావాల్సిన ధైర్యాన్ని అందించాలి. మెనోపాజ్ సమయంలో నా భార్య చాలా ఇబ్బంది పడింది. ప్రవర్తనలో కూడా ఎంతో మార్పు ఉంది. మెనోపాజ్ సమస్యలకి ముంబైలోని ఓ వైద్యుడిని కలిసిన తర్వాత నా భార్య నేను ఇప్పుడు బావున్నాను అని చెప్పింది. ఆయన ఏ మందులు ఇవ్వలేదు కానీ ఆమెకు ధైర్యాన్ని ఇచ్చారు. రోగులకు చికిత్సతో పాటు... ప్రజలకు వ్యాధులపై సరైన అవగానహ కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉంది."

- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

వైద్య కళాశాలల పెంచుతామని ప్రకటించిన ప్రధానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah naidu) కృతజ్ఞతలు చెప్పారు. దేశంలో వైద్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.