అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట ఏపీ ముఖ్యమంత్రి చెప్పిన మూడురాజధానులపై స్పందించారు. పాలనంతా ఒకేచోట ఉండాలనేది తన అభిప్రాయం అని చెప్పారు. సచివాలయం, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్కచోటే ఉంటేనే సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. తన 42 ఏళ్ల అనుభవంతో ఈ మాట చెబుతున్నానని వెంకయ్య చెప్పారు. తన నిర్ణయాన్ని కేంద్రం అడిగినా ఇదే చెబుతాన్నారు. అయితే.. రాజధాని ఎక్కడ ఉండాలనేది ప్రజల నిర్ణయం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. స్వర్ణభారతి ట్రస్టులో పద్య వైభవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య హాజరయ్యారు.
తెలుగు భాషపై స్పందింస్తూ... తెలుగు భాషలో కమ్మదనం ఉందని మన సంస్కృతి, భాష, ఆచారవ్యవహారాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. మాతృభాష 'కళ్లు' లాంటిది, పరాయి భాష 'కళ్లజోడు' లాంటిదని వ్యాఖ్యానించారు. మాతృభాషపై ప్రేమ పెంచుకోవాలంటే... ఇతర భాషలు వద్దని కాదని తెలిపారు.
ఇదీ చూడండి: 5 ఎకరాల పొలం.. 23 రకాల పంటలు...