కరోనా చికిత్స కోసం ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో.. వనమూలికలు, ఇతర పదార్థాలతో తయారు చేస్తున్న ఔషధాన్ని ఆనందయ్య అనే వ్యక్తి ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ ఆయుర్వేద మందు విషయంలో నెలకొన్న పరిస్థితులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టికి చేరాయి. దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి.. వెంటనే ఆయూష్ ఇన్‌ఛార్జి మంత్రి కిరణ్ రిజ్జు, ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆయుర్వేదం ఔషధంపై అధ్యయనం చేయాలని.. వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చూడాలని వారికి సూచించారు.
నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్య
ఏపీలోని నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఈ మేరకు ఆయూష్ ఇన్‌ఛార్జి మంత్రి కిరణ్ రిజ్జు, ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్‌కు సూచించారు.
కరోనా చికిత్స కోసం ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో.. వనమూలికలు, ఇతర పదార్థాలతో తయారు చేస్తున్న ఔషధాన్ని ఆనందయ్య అనే వ్యక్తి ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ ఆయుర్వేద మందు విషయంలో నెలకొన్న పరిస్థితులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టికి చేరాయి. దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి.. వెంటనే ఆయూష్ ఇన్‌ఛార్జి మంత్రి కిరణ్ రిజ్జు, ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆయుర్వేదం ఔషధంపై అధ్యయనం చేయాలని.. వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చూడాలని వారికి సూచించారు.
ఇదీ చూడండి.. అన్ని విధాలా అండగా ఉంటాం: సీఎం కేసీఆర్