దిల్లీలో జరిగే అల్లర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో జరిగిన అల్లర్లల్లో ఇప్పటి వరకు 34 మంది చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. సీఏఏ కారణంగానే ఈ అల్లర్లలు జరుగుతోన్నయన్నారు. దేశం నుంచి వెలివేస్తారని ఓ వర్గం తీవ్ర భయాందోలనతో బతుకుతోందన్నారు.
భాజపా నాయకులు రెచ్చగొట్టి హింసను ప్రేరేపించి... శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అల్లర్లకు మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ప్రణయ్ హత్యకేసులో వాదనలు పూర్తి...