ETV Bharat / city

'భారతీయ సంస్కృతి భవిష్యత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలదు' - భారతదేశం గొప్పతనం గురించి వెంకయ్య నాయుడు మాటాల్లో

Venkaiah Naidu Speech in Singapore: భారతీయ సంస్కృతి భవిష్యత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలదని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సింగపూర్‌లో తెలుగు కళలు, సంస్కృతిని కాపాడుకుని ముందుతరాలకు అందజేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శ్రీ సాంస్కృతిక కళాసారధి ద్వితీయ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Venkaiah Naidu
Venkaiah Naidu
author img

By

Published : Oct 16, 2022, 10:13 PM IST

Venkaiah Naidu Speech in Singapore: ప్రశాంతమైన జనజీవన ప్రవాహానికి సంస్కృతే ఒరవడి అని.. సువిశాల దృక్పథం, ఉదాత్తమైన భావనల సమాహారమైన భారతీయ సంస్కృతి భవిష్యత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలదని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మలేసియా, సింగపూర్ పర్యటనల్లో ఉన్న ఆయన.. సింగపూర్‌లో తెలుగు కళలు, సంస్కృతిని కాపాడుకుని ముందుతరాలకు అందజేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శ్రీ సాంస్కృతిక కళాసారధి ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా సింగపూర్‌లో తెలుగు కళలు, సంస్కృతిని కాపాడుకుని ముందుతరాలకు అందజేయాలన్న సంస్థ ఆశయం అభినందించదగినదన్నారు. ఈ క్రమంలోనే ఆంగ్లేయులు చరిత్రను వక్రీకరించి.. దేశ మహనీయుల గొప్పతనాన్ని తక్కువ చేసి చూపించారని వెంకయ్యనాయుడు అన్నారు. సత్ప్రవర్తన, కార్యదీక్ష, స్నేహశీలత వంటివి మన ముందుతరాల నుంచి వారసత్వంగా మనకు అందాయని.. వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని గుర్తు చేశారు. దయ, ఓర్పు, పరోపకారం, ధర్మ నిష్ట, శాంతి, ప్రేమ, అహింస వంటి ఎన్నో ఉత్తమ గుణాల గురించి మన పురాణాలు, ఇతిహాసాలు సమగ్రంగా చర్చించాయని, ఎందరో మహనీయుల కథలు మనకు ఆదర్శంగా నిలిచాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

"ప్రపంచానికి నాగరికత నేర్పిన వేదభూమి భారతదేశం. చరిత్రలో యుద్ధాల్లో భారతీయులు సాధించిన విజయాలు తప్ప, భారతీయులు ఇతర దేశాలపై దండెత్తిన సందర్భాలు మచ్చుకైనా కనిపించవు. బలంగా ప్రతిఘటించడమే తప్ప, బలాన్ని చూపించేందుకు కవ్వించే సంస్కృతి భారతదేశానికి లేదు. లింగ, భాష, మత, వర్గ, జాతీయత లాంటి వ్యత్యాలకు అతీతంగా నడుచుకునే వ్యక్తిత్వమే కలసికట్టుగా జీవించేందుకు పునాది వేస్తుంది. ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూడగలిగే భారతీయ దృక్పథం, అహింసకు పునాదిగా నిలుస్తుంది. సంస్కృతి అంటే పూజలు, పునస్కారాలు కాదు.. పెద్దలు, స్త్రీలను గౌరవించటం సంస్కృతిలో భాగం". - ముప్పవరపు వెంకయ్య నాయుడు

భారతీయ సంస్కృతి భవిష్యత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలదు: వెంకయ్య నాయుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.