ETV Bharat / city

హైదరాబాద్​లో వీగనిజం.. వర్ధిల్లుతోంది! - వీగన్ ఫుడ్

ఆదివారం వచ్చిందంటే.. ముక్క లేనిదే.. ముద్ద దిగదు కొంతమందికి. అసలు రోజుతో సంబంధం లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చికెన్, మటన్ లాగించేసేవాళ్లు కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు యూత్ స్టైల్ మార్చారు. మాంసం వద్దు.. వీగన్ జీవులమైపోదాం.. అంటున్నారు.

Vegan Food Spreads In Hyderabad
వీగనిజం.. వర్ధిల్లుతోంది!
author img

By

Published : Feb 22, 2020, 7:27 PM IST

Updated : Feb 23, 2020, 7:07 AM IST

వీగనిజం.. వర్ధిల్లుతోంది!

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం.. వీగనిజం. కట్టుబొట్టు, తినే తిండి, వాడే వస్తువులన్నీ ఇప్పుడు వీగన్ స్టైల్​లోకి మార్చేస్తున్నారు. ఇంతకీ వీగన్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? పూర్తిగా అహింసా మార్గాన్ని అనుసరించడమే వీగన్. లెదర్ బ్యాగులు, మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, తేనే, జంతువుల నుంచి వచ్చే ఆహార పదార్థాలు, వస్తువులు వాడకపోవడమే వీగన్. ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన వీగన్.. మనదేశంలో కూడా మొదలయింది. ఎక్కువమంది యువత వీగన్ లైఫ్​స్టైల్​ని ఫాలో అయేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే.. హైదరాబాద్​లో వీగన్ అడ్డాలు పెరిగిపోతున్నాయి.

విభిన్న లైఫ్​స్టైల్.. వీగన్..

అయితే.. చాలామంది వీగన్ అనగానే.. కేవలం ఆహారం విషయంలో మాత్రమే ఉంటుందనుకుంటారు. కానీ.. అది వాస్తవం కాదు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు చేసే అన్నీ పనులు, వాడే అన్నీ వస్తువుల్లో వీగనిజం ఉంటుంది. వీగన్ లైఫ్​స్టైల్ ఫాలో అయ్యేవారు సిల్క్, ఉన్ని దుస్తులు వేసుకోరు. లెదర్ బెల్టులు, బ్యాగుల జోలికే వెళ్లరు. జంతువుల ద్వారా వచ్చే ఏ ఉత్పత్తిని వీళ్లు వాడరు. ఇలాంటి లైఫ్​స్టైల్​ ఫాలో అవడం వల్ల సాటి జీవులను ప్రేమించమని చెప్పడమే వీరి ఉద్దేశం. సోషల్ మీడియాలో వీగనిజాన్ని ప్రచారం చేసే గ్రూపులు యాక్టివ్​గా పనిచేస్తున్నాయి. జంతువుల పట్ల మనుషులు దయగా ఉండాల్సిన అవసరాన్ని ప్రచారం చేస్తున్నారు వీగన్ ప్రేమికులు.

హైదరాబాద్.. వీగన్ స్పాట్..

ఈ వీగన్​ల సంఖ్య హైదరాబాద్​లో రోజురోజుకు పెరుగుతోంది. అందుకే .. ఈ మధ్య హైదరాబాద్​ని వీగన్ ఫ్రెండ్లీ సిటీగా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. కొంతకాలం క్రితం.. వీగన్​గా మారిన వారు వీగన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో వెతుక్కోడానికి చాలా ఇబ్బంది పడేవారు. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. హైదరాబాద్​లో చాలాచోట్ల వీగన్ ఫుడ్ కోర్టులు వెలిశాయి. అక్కడికి వెళ్తే.. ఎలాంటి జీవహింస చేయకుండానే నోటికి ఇంపైన ఆహారాన్ని ఆరగించవచ్చు.

నాన్ వెజ్ ప్రియుల కోసం మాక్ నాన్ వెజ్ ఐటెమ్స్ కూడా దొరుకుతున్నాయి. జంతు సంబంధ ఉత్పత్తులు వద్దని జరుగుతున్న ఈ ప్రచారంతో ఆరోగ్యమే కాదు పర్యావరణానికి కూడా లాభమే అంటున్నారు ప్రకృతి ప్రేమికులు.

Last Updated : Feb 23, 2020, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.