గతేడాది కొవిడ్ సమయంలో ఆకలి బాధలు చూసి చలించిపోయాడు.. హైదరాబాద్ మణికొండకు చెందిన రాజు. మిత్రులతో కలిసి వాసవి బిజినెస్ గ్రూప్ ఫౌండేషన్ స్థాపించాడు. కరోనా తొలిదశలో 108 రోజుల పాటు పేదలకు అన్నదానం, నిత్యావసర సరకులు అందించారు. ప్రస్తుతం రెండోసారి లాక్‌డౌన్ విధించడంతో... వారం రోజులుగా నిత్యం 700 మందికి అన్నదానం చేస్తున్న తనవంతుగా సాయం అందిస్తున్నాడు. 200 మంది కొవిడ్ రోగులకు ఇంటివద్దకే భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ఫౌండేషన్ ద్వారా నిత్యావసరాలు, పేదలకు కుట్టుమిషన్‌లు, రక్తదానం, ప్లాస్మాదానం చేస్తున్నట్లు రాజు వెల్లడించారు.
సేవా కార్యక్రమంలో భాగ్యస్వామ్యమైనందుకు చాలా సంతోషంగా ఉందని... ఫౌండేషన్ సభ్యులు వివరించారు. నిత్యం లక్డీకపూల్ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలోని 90 మంది రోగులకు వాహనం ద్వారా ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు సహకారంతో ఈ సేవ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు.
లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు అన్నదానం కొనసాగుతుందని రాజు చెబుతున్నారు. కొవిడ్ రోగులు వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తే ఇంటికే భోజనాన్ని అందిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: ఆపాత శిల్పం... మహిమ అమోఘం