ETV Bharat / city

Varalakshmi Vratam Story : విశ్వమంతా లక్ష్మీమయం - వరలక్ష్మీ వ్రతం కథనం

Varalakshmi Vratam Story : శ్రావణమాసమంటే మనందరికీ బోల్డంత ఇష్టం. పూజలూ పెళ్లిళ్లతో కళకళలాడుతుంది. అందునా ఈరోజు రెండో శుక్రవారం. నిన్ననే అవసరమైన సరంజామా అంతా తెచ్చేసి, శనగలు నానబెట్టేసి ఉంటారు. సంతోషంగా, సంబరంగా వ్రతం చేసుకునే ముందు వరలక్ష్మీ దేవి విశిష్టతను తెలుసుకుందాం..

Varalakshmi Vratam
Varalakshmi Vratam
author img

By

Published : Aug 5, 2022, 6:25 AM IST

దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమల చారుజలప్లుతాంగీం
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథగృహిణీం అమృతాబ్ధి పుత్రీం

ఏనుగులతో అభిషేకం అందుకుంటున్న శ్రీమహాలక్ష్మిని ఉదయం లేవగానే స్మరిస్తే ఇంట్లో, ఒంట్లో కూడా దారిద్య్రం ఉండదన్నారు ఆదిశంకరాచార్యులు.

అదేంటోగానీ లోకంలో చాలామంది లక్ష్మి ఉన్నా లేదని, సరస్వతి లేకున్నా ఉందని చెబుతారు. ఇంతకీ లక్ష్మి అంటే కేవలం డబ్బనుకుంటున్నారా?! నిజానికి ‘లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం’ అన్నారు. అంటే జగతిని అన్నివేళలా కనిపెట్టుకు ఉండేది లక్ష్మి అని అర్థం. దీన్ని బట్టి విశ్వమంతా లక్ష్మీమయమే. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి- ఇలా అష్టలక్ష్ముల రూపంలో అలరిస్తుంది. అంతేనా.. ఇలలో భూలక్ష్మిగా, ఇంట్లో గృహలక్ష్మిగా, పరలోకంలో స్వర్గలక్ష్మిగా అంతటా ఉండి వెలుగులు నింపుతుంది.

కమలనయన! నీవు కలచోటు సరసంబు
నీవు లేని చోటు నీరసంబు
కంబుకంఠి! నీవు కలవాడు కలవాడు
లేనివాడు నీవు లేని వాడు

అన్నాడు శ్రీనాథుడు. అలాంటి లక్ష్మీదేవిని శ్రావణంలో వరలక్ష్మిగా కలశరూపంలో ఆరాధిస్తాం. జలం, దర్భ, పసుపు, కుంకుమ తదితరాలను మంత్రించి ఆవాహన చేస్తే దేవతలు కరుణిస్తారట.

వరలక్ష్మీ అమ్మవారు

మన పురాణాల్లో లక్ష్మి రాకపోకల గురించిన కథ ఒకటుంది. ఒకసారి ఇంద్రుడు అహంకారంతో విష్ణుప్రసాదాన్ని ధిక్కరించాడు. ఆనక పశ్చాత్తాపంతో హరి వద్దకు వెళ్లగా ‘శుచీశుభ్రత, సదాచారం, ప్రేమానురాగాలు, దైవారాధనలు ఉన్నచోట, సత్యభాషణం, ధర్మనిష్ఠత, గోసేవ, విష్ణుసేవ వంటివి పాటించే ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. చిరిగిన దుస్తులు ధరించడం, కఠినంగా మాట్లాడటం, సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో నిద్రించటం.. లాంటి పనులు చేసేవారి ఇళ్లలో లక్ష్మి క్షణమైనా ఉండదు’ అంటూ వివరించాడు శ్రీహరి.

లక్ష్మి అనుగ్రహం పొందాలంటే ముందు శ్రీహరిని ఆరాధించాలి. ఎందుకంటే లక్ష్మీదేవి చంచల, చపలచిత్త. నిలకడగా ఒకచోట ఉండదు. కానీ శ్రీహరిని మాత్రం అంటిపెట్టుకునే ఉంటుంది. అంటే విష్ణ్వారాధనం లక్ష్మీ కటాక్ష రహస్యమన్నమాట.

పెద్దలు ‘రూపేచ లక్ష్మీ’ అన్నారంటే నిండుగా నగలు ధరించమని కాదు. నవ్వుముఖం, సౌమ్యత, ప్రేమగా పలకరించటం వంటి గుణాలతో లక్ష్మీకళ వస్తుందని భావం. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఈ కళలు అలవడతాయి.

‘సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ, శ్రీలక్ష్మీః వరలక్ష్మీశ్చ’ అంటూ వేదం ఆరు లక్ష్ములను ప్రస్తావించి, ‘లక్షణలక్ష్మి’ని జతచేసింది. అంటే మన గుణమే అసలు సిసలైన లక్ష్మి.

కళ్లకు చూపు లక్ష్మి, చెవులకు వినికిడి లక్ష్మి, నోటికి మాట లక్ష్మి, శరీరానికి స్పర్శ లక్ష్మి, బుద్ధికి చైతన్యం లక్ష్మి, సూర్యుడికి వెలుగు లక్ష్మి, చంద్రుడికి వెన్నెల లక్ష్మి. ఇలా గమనిస్తే విశ్వమంతా లక్ష్మీమయమే.

యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

అనుక్షణం లోకాన్ని గమనిస్తూ, దయతో పోషిస్తూ మనకు సర్వసంపదలూ సమకూరుస్తున్న వరలక్ష్మిని శ్రావణమాసంలోనే కాదు నిరంతరం పూజించవచ్చు. ఆ దేవిని ఆరాధించి అనుగ్రహం పొందాలి అందరూ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.