Anitha letter to AP CM: వైకాపా నేతలు... కాలకేయుల్లా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులపై ఏపీ సీఎం జగన్కు అనిత బహిరంగలేఖ రాశారు. మచిలీపట్నం వీఓఏ నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేనన్నారు. వైకాపా నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఈ మూడేళ్లలో మహిళలపై 1500కు పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగితే.. ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. "దిశ" కింద ఒక్క నేరస్థుడికైనా శిక్ష విధించారా? అని ప్రశ్నించారు.
Anitha letter to AP CM: రాష్ట్రంలో 'యథా లీడర్-తథా కేడర్' అన్నట్లుగా పరిస్థితి తయారైందని అనిత విమర్శించారు. ప్రభుత్వ చర్యలు నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నాయని అన్నారు. ఆడబిడ్డలపై వరుస అఘాయిత్యాలకు.. ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమని ఆరోపించారు. దేశంలో మహిళలపై జరిగే నేరాల్లో మూడోవంతు ఏపీలోనే జరగడం సీఎం అసమర్థతకు నిదర్శనంగా పేర్కొన్నారు.
ఆడబిడ్డలు అన్యాయమైపోతుంటే... వైకాపా మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి 'జే ట్యాక్స్' వసూళ్లు పక్కనపెట్టి.. మహిళా భద్రతపై దృష్టి పెట్టాలని అనిత హితవు పలికారు.
ఇదీ చూడండి: మహా సంప్రోక్షణకు సిద్ధమవుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రం...