హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం కార్యాలయంలో వలస దు:ఖం పుస్తకావిష్కరణ జరిగింది. కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్ సంపాదకులుగా, డాక్టర్ ఏరుకొండ నరసింహుడు గౌరవ సంపాదకులుగా కరోనా నేపథ్యంలో... లాక్డౌన్ వల్ల వలస కార్మికుల కష్టాలను అక్షరీకరించి పుస్తకంలో పొందుపరిచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 110 మంది కవుల కవిత్వ సంకలనం '"వలస దుఃఖం" పుస్తకంలో పొందుపరిచారు.
తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా ఇంత ఉద్ధృతంగా ఉన్నా మనుషులు మారినట్టుగా కనిపిస్తున్నారు తప్ప ఏమీ మారలేదని... నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో వలసదారుల దుఃఖాన్ని సంకలనంగా అచ్చువేసిన సంపాదవర్గాన్ని అభినందించారు.
ఇదీ చూడండి: ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా...