రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యశాఖ నుంచి వారిని రిస్క్ టేకర్స్గా భావించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా... ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, డిగ్రీ అధ్యాపకులకు... సిబ్బందికి, పలు విభాగాల్లోని ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 18 ఏళ్ళు పైబడిన వారందరూ తమ దగ్గరలోని ప్రభుత్వ టీకా కేంద్రానికి.. సంస్థ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులను తీసుకుని వెళితే టీకా వేస్తారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.