ETV Bharat / city

హెల్త్ కేర్ వర్కర్లకు ముగిసిన తొలిదశ వ్యాక్సినేషన్ - ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్​

ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో కలిపి కేవలం 58.3శాతం మంది హెల్త్ కేర్ వర్కర్లు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకోని వారికి మరోమారు అవకాశం కల్పించబోమని స్పష్టం చేసింది. శనివారం నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు పేర్కొంది.

vaccination Completed For Healthcare Workers and only 58% people took the corona vaccine
హెల్త్ కేర్ వర్కర్లకు ముగిసిన తొలిదశ వ్యాక్సినేషన్
author img

By

Published : Feb 5, 2021, 10:47 PM IST

రాష్ట్రవ్యాప్తంగా తొలిదశ వ్యాక్సినేషన్​లో భాగంగా హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ముగిసినట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో కలిపి సుమారు 3.3లక్షల మంది కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. అందులో కేవలం 1లక్షా 93వేల 485మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

అవకాశం లేదు:

కేవలం 58.3శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నట్టు స్పష్టం చేసింది. అయితే రిజిస్టర్ చేసుకున్న వారిలో కొందరు అనేక కారణాలతో వ్యాక్సిన్ తీసుకోలేదని.. అలాంటి వారికి మరోమారు అవకాశం కల్పించబోమని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఫ్రంట్ లైన్ వర్కర్లకు..

ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అతి స్వల్పమందికి మాత్రమే చిన్న రియాక్షన్​లు వచ్చినట్టు ప్రకటించింది. శనివారం నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల సిబ్బంది మొత్తం సుమారు 2లక్షల మంది వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నట్టు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: విద్యార్థులకు ల్యాప్​టాప్​లు అందించిన మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.