హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం హిందు, ముస్లింల ఐక్యతకు నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
హిందు, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసుండాలని హనుమంతరావు ఆకాంక్షించారు. ఒకరినొకరు గౌరవించుకోవాలన్నారు. కొందరు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని.. అవి మానుకోవాలని వీహెచ్ హితవు పలికారు. ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టొద్దని కోరారు.
ఇదీ చూడండి: సోమవారం నుంచి పాతపద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు