కరోనా వైరస్ సోకకుండా అత్యవసర సేవల్లో ఉన్న వారు ఉపయోగించే వ్యక్తిగత రక్షణ దుస్తులను నిత్యవసర సరకులు అందిస్తున్న వారూ వినియోగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. సామాజిక బాధ్యతగా శారద అనే మహిళ డీవీఆర్ ఎక్స్ పో కంపెనీ ద్వారా పీపీఈ కిట్లను తయారు చేయిస్తున్నారు. కరోనా విజృంభన దృష్ట్యా రానున్న రోజుల్లో పీపీఈ కిట్ల వినియోగం తప్పనిసరి కానుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె రోజుకు రెండు వేలకు పైగా కిట్లను తయారు చేయిస్తున్నారు. జూబ్లీహిల్స్, అంబర్ పేట ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయిన టైలర్లతో పీపీఈ కిట్లు తయారు చేయిస్తూ వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న శారదతో ఈటీవీ భారత్ ప్రతినిధి సతీశ్ ముఖాముఖి..
ఇవీచూడండి: నెల వ్యవధిలోనే 20 వేలు దాటిన కరోనా కేసులు