అమెరికా నూతన అధ్యక్షునిగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా.. హైదరాబాద్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు రాచకొండ రాజు జో బైడెన్ పేరును బంగారు బియ్యం గింజపై రాశారు. మంత్రుల అధికారిక నివాసంలో దీనిని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు.
![Us President joe biden Name On gold Rice in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10297767_jo.jpg)
యువత నూతనంగా ఆలోచించి ముందుకు వెళ్లాలని పోచారం అన్నారు. కళకు సృజనాత్మకత జోడిస్తే అపార అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సూక్ష్మ కళాకారుడు రాజును పోచారం అభినందించారు.
ఇదీ చూడండి: భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: విజయశాంతి