ETV Bharat / city

Mansas Trust: ఏపీ హైకోర్టులో ఊర్మిళ గజపతిరాజు పిటిషన్..

మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ విషయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఊర్మిళా గజపతిరాజు ఏపీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Mansas Trust issue, urmila gajapathi raju appeal in ap high court
ఏపీ హైకోర్టులో ఊర్మిళ గజపతిరాజు పిటిషన్, సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్
author img

By

Published : Aug 9, 2021, 6:23 PM IST

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ విషయంలో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ఆనంద గజపతి రాజు కుమార్తె ఊర్మిళా గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పీల్​కు వెళ్లారు. అశోక్ గజపతి రాజును ఛైర్మన్​గా పునరుద్ధరించాలని ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది.

మాన్సాస్ వివాదం ఏంటంటే..

మాహారాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ -మాన్సాస్ ట్రస్టును.. 1958లో పూసపాటి పీవీజీ రాజు స్థాపించారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ కింద 108 ఆలయాలు, 14,800 ఎకరాల భూములున్నాయి. విద్యాసంస్థల నిరంతర మద్దతు కోసం ఆర్థిక సాయం అందించడానికి.. ట్రస్ట్ డీడ్ వారసత్వంగా 'ఎల్డెస్ట్ మేల్ లీనియల్ వారసుడు' గా.. నిర్వచించారు. దాని ప్రకారం 1994లో పీవీజీ రాజు మరణం తరువాత ఆయన పెద్ద కుమారుడు పూసపాటి ఆనంద గజపతి రాజు ట్రస్ట్ ఛైర్మన్ అయ్యారు.

పోటాపోటీ వాదనలు

2016లో ఆనంద గజపతి మరణం తరువాత.. పీవీజీ రాజు రెండో కుమారుడైన అశోక్ గజపతి రాజు పగ్గాలు అందుకున్నారు. గతేడాది మార్చిలో రాత్రికి రాత్రే అశోక్ గజపతిరాజును మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా తప్పించిన ఏపీ ప్రభుత్వం.. ఆనంద గజపతి రాజు కుమార్తె సంచైత గజపతిరాజుకు పగ్గాలు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ జీవోను అశోక గజపతిరాజు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై పోటాపోటీగా వాదనలు జరిగాయి. సంచైతను ట్రస్ట్ ఛైర్మన్‌గా నియమించే అధికారం సర్కార్‌కు ఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు.

జీవోల కొట్టివేత

అశోక్‌గజపతిరాజు న్యాయవాదులు మాత్రం ఏపీ ప్రభుత్వ జీవో... ట్రస్ట్‌ వీలునామా నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ట్రస్ట్‌ ఛైర్మన్‌గా పురుషుల అనువంశకత కొనసాగింపును మార్చాలంటే ట్రైబ్యునల్ ద్వారానే సాధ్యమని... ఆ రాష్ట్ర ప్రభుత్వ అభీష్టం మేరకు మార్చడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అశోక్‌గజపతిరాజు వాదనతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు... సంచైత నియామకంతోపాటు మాన్సాస్‌ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా ఊర్మిళా గజపతిరాజు, ఆర్‌వీ సునీత ప్రసాద్‌ను గుర్తిస్తూ ఇచ్చిన జీవోలనూ కొట్టేసింది. ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజును పునరుద్ధరించాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: JUSTICE NV RAMANA: జస్టిస్ పి.కేశవరావు మృతి పట్ల సీజేఐ సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.