అకాల వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమైందని.. గత వందేళ్లలో ఎన్నడూ కురవనంత వర్షాలు, వరదలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెరాస నేత, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ అన్నారు. వరద బాధితులకు బాసటగా ఉండేందుకు.. ప్రభుత్వానికి సహకరించేందుకు సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలను మంత్రి కేటీఆర్కు అందజేశారు.
గతంలోనూ ఉప్పల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు ఉప్పల శ్రీనివాస్ పేర్కొన్నారు. వివాహం చేసుకునే పేదింటి ఆడబిడ్డలకు బంగారు పుస్తెలు, వెండి మెట్టెలు అందిస్తున్నామని తెలిపారు. భారీ వరదలు ప్రజల జీవితాలను నాశనం చేశాయని.. తక్షణ ఉపశమనం కోసం సీఎం కేసీఆర్ రూ. 550 కోట్లను విడుదల చేయడం గొప్ప విషయమన్నారు.