లాక్‌డౌన్ నేపథ్యంలో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ నారాయణగూడ, హిమాయత్ నగర్‌లోని పలు బస్తీల్లో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. పేదలకు నిత్యవసరాలను పంపిణీ చేశారు. నగర వ్యాప్తంగా ప్రతిరోజూ తమ ఫౌండేషన్ తరపున బియ్యం, పప్పు, నూనె, చింతపండుతో పాటు ఇతర నిత్యవసర సరుకుల పేదలకు అందిస్తున్నామని ఉప్పల శ్రీనివాస్ తెలిపారు.
దీనితో పాటుగా రోజూ రెండు వేల మందికి అన్నదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విపత్కర సమయంలో ఉపాధి లేక ఇబ్బందిపడుతున్న ప్రతి ఒక్కరికి తమ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: కరోనా తప్పుడు సమాచారంతో తంటాలు