ETV Bharat / city

విద్యార్థుల క్రెడిట్లకు ఓ బ్యాంకు - telangana education system

ఎక్కడైనా చదువుకోవచ్చు... ఏడాది ముగిసిన తర్వాత మరో విద్యాసంస్థలోకి మారొచ్చు. మధ్యలో మానుకుని రెండేళ్ల తర్వాత మళ్లీ అదే కోర్సును కొనసాగించవచ్చు. నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. జాతీయ నూతన విద్యా విధానం-2020లో కేంద్రం తీసుకొచ్చిన మార్పులివి. అందుకు అనుగుణంగా ఆ వెసులుబాట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు అకడమిక్‌ క్రెడిట్లకు అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌(ఏబీసీ) పేరిట ఓ బ్యాంకును యూజీసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Academic Bank of Credits to give credits to students
విద్యార్థుల క్రెడిట్లకు ఓ బ్యాంకు
author img

By

Published : Jan 30, 2021, 7:16 AM IST

వచ్చే విద్యా సంవత్సరం(2021-22) నుంచి అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్​ను అమలు చేసేందుకు వీలుగా విధివిధానాల రూపకల్పనకు నిపుణుల కమిటీని నియమించిన యూజీసీ తాజాగా ముసాయిదాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు పంపింది. ఫిబ్రవరి 5వ తేదీలోపు అభిప్రాయాలను పంపాలని కోరింది.

విద్యార్థులు ఖాతాదారులే కానీ..

ఉన్నత విద్యలో ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌(సీబీసీఎస్‌) విధానం అమలవుతోంది. అంటే సబ్జెక్టుల వారీగా క్రెడిట్లు ఇస్తారు. ఒక కోర్సు పాసవ్వాలంటే కనీసపు క్రెడిట్లను విద్యార్థులు సాధించాల్సి ఉంటుంది. జాతీయ నూతన విద్యావిధానంలో విద్యార్థులు ఒక చోట నుంచి మరో వర్సిటీ లేదా కళాశాలలోకి మారేందుకు, ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థులు కొన్ని ఇష్టమైన సబ్జెక్టులను చదువుకునేందుకు అవకాశం కల్పించబోతున్నారు. అప్పుడు ఆ విద్యార్థి క్రెడిట్లు కూడా బదిలీ అయితేనే కొత్త విద్యా సంస్థలో చదువుకునేందుకు అనుమతి వస్తుంది. ఆ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఏబీసీ పేరిట క్రెడిట్‌ బ్యాంకును యూజీసీ ఏర్పాటు చేయనుంది. విద్యార్థులు పొందిన క్రెడిట్లను ఆయా వర్సిటీలే ఆ బ్యాంకుల్లో నిల్వ చేస్తాయి. విద్యార్థులు కొంత రుసుం చెల్లించి ఖాతా తెరుచుకోవాలి. ప్రతి ఒక్కరికి ఓ ఐడీ సంఖ్య ఇస్తారు. వారు సొంతంగా క్రెడిట్లను డిపాజిట్‌ చేయలేరు. కాకపోతే తమ ఖాతాలో ఎన్ని క్రెడిట్లు ఉన్నాయో చూసుకోవచ్చు. కొత్త కోర్సులో చేరేటప్పుడు విద్యార్థి ఖాతాను పరిశీలించి అవసరమైన క్రెడిట్లు ఉంటేనే సదరు విద్యాసంస్థ సీటు ఇస్తుంది. ఇది డిగ్రీ, డిప్లొమా, పీజీ తదితర అన్ని రకాల ఉన్నత విద్యా కోర్సులకు వర్తిస్తుంది.

ముఖ్యాంశాలివీ..

* న్యాక్‌ ఏ గ్రేడ్‌ ఉన్న విద్యాసంస్థలు ఏబీసీలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. తర్వాత విద్యాసంస్థ గ్రేడ్‌ పడిపోతే దాన్ని బ్యాంకు నుంచి తొలగిస్తారు. అప్పటివరకు ఉన్న విద్యార్థుల క్రెడిట్లకు సమస్య ఉండదు.

* స్వయం, ఎన్‌పీటీఈఎల్‌, వీ-ల్యాబ్‌ తదితర పథకాల ద్వారా ఆన్‌లైన్‌లో క్రెడిట్లను సాధించినా డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఆ సంస్థలే డిపాజిట్‌ చేస్తాయి.

* విద్యార్థి తాను చదివిన విద్యాసంస్థ నుంచి 30-50 శాతం క్రెడిట్లు సాధించడం తప్పనిసరి. అందుకు భిన్నంగా అన్నీ ఆన్‌లైన్‌లో చదివి క్రెడిట్లు పొందుతానంటే చెల్లదు. తాను చదివే వర్సిటీ/కళాశాల బయట నుంచి 50-70 శాతం క్రెడిట్లు పొందొచ్చు.

* ఆయా కోర్సుల్లో క్రెడిట్లు సాధించిన తర్వాత వాటికి ఏడేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఆ గడువు లోపు వాటిని వినియోగించుకొని ఇతర కోర్సు చేయవచ్చు.

కాలపరిమితి సరికాదు

ఒక వైపు ఎప్పుడైనా చదువు ఆపొచ్చు...ఎప్పుడైనా చదువుకోవచ్చని చెబుతూనే ఏడేళ్ల కాలపరిమితి పెట్టడం మంచిది కాదని జేఎన్‌టీయూహెచ్‌ పరీక్షల విభాగం సంచాలకుడు ఆచార్య కామాక్షిప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ధ్రువపత్రాలను దాచుకోవడానికి డి.జి. లాకర్‌ ఉందని, దానికి పొడిగింపుగా దీన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఓయూ విశ్రాంత ఆచార్యుడు ఎస్‌.సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల వలసలు ఎక్కువవుతున్నాయని, ఇంటి నుంచే కోర్సులు చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఇది ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.